స్వామివారి ఆదాయం రూ.7.81లక్షలు

ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. సంక్రాంతి, కనుమ పండుగలలో వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించుకున్నారు. ఆలయాన్ని పుష్పాలతో అలంకరించారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖద్వారం వద్ద పుష్పాలతో అలంకరించారు. గోవిందనామస్మరణతో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రెండ్రోజుల్లో స్వామివారికి లభించిన ఆదాయం రూ.7,81,970 లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us