చంద్రన్న పెళ్లికానుక అందజేత

UPDATED 30th OCTOBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో నూతన వధూవరులు సునీత, శ్రీనుబాబులకు చంద్రన్న పెళ్లికానుక ప్రోత్సాహంలో భాగంగా రూ.40 వేలు నగదు ప్రోత్సాహాన్ని తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి మంగళవారం అందచేశారు. ఈ సందర్భంగా చల్లా బుజ్జి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులకు  చంద్రన్న పెళ్లికానుక పధకంలో భాగంగా నగదు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కలవల చంద్రరావు, తలారి పోతురాజు, మచ్చ పద్మావతి, నక్క శ్రీదేవి, యానిమేటర్స్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us