గైట్ లో ముగిసిన మిషన్ లెర్నింగ్ శిక్షణ

UPDATED 6th JULY 2019 SATURDAY 4:30 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల, గ్రేటర్ నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీతో కలిసి మిషన్ లెర్నింగ్ పై రెండురోజులపాటు నిర్వహించిన ఫాకల్టీ డవలప్ మెంట్ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా గైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్ మాట్లాడుతూ మిషన్ లెర్నింగ్ పై పెంచుకున్న పరిజ్ఞానం యువ ఇంజినీర్లు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగమని అన్నారు. అధ్యాపకులు నిరంతర విద్యార్థులని, మారుతున్న ఆధునిక సాంకేతిక పద్దతులపై విస్తృతమైన అవగాహన పెంచుకునేందుకు ఇటువంటి శిక్షణలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మిషన్ లెర్నింగ్ కు విస్తృతమైన పరిధి ఉందని, ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లో దీని ప్రాముఖ్యత ఎక్కువగా కనపడుతోందని పేర్కొన్నారు. కళాశాల సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ బి. సుజాత మాట్లాడుతూ రెండురోజులపాటు నిర్వహించిన ఎఫ్.డి.పికి 79 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీత కుమార్ గుప్తా, గైట్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లీలావతి, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us