ప్రగతి విద్యార్థులకు ప్రతిభ అవార్డులు పంట

UPDATED 27th JUNE 2018 WEDNESDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పది మంది విద్యార్థినీ, విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారాలను కాకినాడ జె.ఎన్.టి.యు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. రామకృష్ణారావు చేతులమీదుగా అందుకున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు పురస్కారాలు సాధించిన విద్యార్థులకు, అందుకు కృషి చేసిన అధ్యాపకులకు అభినందించారు. అదే విధంగా మిగిలిన విద్యార్థులు కూడా తమ వంతు ప్రయత్నించి మరెన్నో ఇటువంటి విజయాలు సాధించాలని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శంభూప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు మరింత కృషి చేసి మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ పురస్కారాలు సాధించిన చంద్రాభట్ల హైమావతి అన్నపూర్ణ, బుద్ధరాజు గుణర్జాదేవి (సివిల్ ఇంజనీరింగ్), సరదా అబ్బాయి (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్), తిరణం సంతోష్, రాయుడు సాయికుమార్, సబ్బెళ్ళ నాగ సుబ్బలక్ష్మీ (మెకానికల్ ఇంజనీరింగ్), చోడిశెట్టి సాయిగాయిత్రి, బోడపతి గౌతమి, మాలోతు తేజశ్విని (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్), ఊలగంటి కృష్ణ ప్రియమాధురి (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) లను ఎమ్.వి. హరనాధబాబు (డైరక్టర్ మేనేజ్మెంట్), డాక్టర్ జి.రఘురామ్ (డైరక్టర్), ఎమ్. సతీష్ (వైస్ ప్రెసిడెంట్), డాక్టర్ కె. సత్యనారాయణ (వైస్ ప్రిన్సిపాల్), డాక్టర్ జి. నరేష్ (డీన్ అడ్మిన్), డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజు (డీన్ అర్ అండ్ డీ), ప్రొఫెసర్ వై. జయబాబు (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్), వివిధ విభాగాధిపతులు, కళాశాల సిబ్బంది, తదితరులు విజేతలకు అభినందించారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us