ఆసుపత్రి సమస్యలపై తహసీల్దార్ కు ఫిర్యాదు

UPDATED 23rd APRIL 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు లేక గర్భిణీ స్త్రీలు, రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే స్టాఫ్ నర్సులను నియమించాలని కోరుతూ జిల్లా మానవ హక్కుల సంఘం ప్రతినిధులు తహసీల్దార్ ఎల్. శివకుమార్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సుమారు రెండునెలలు క్రితం రోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి తక్షణమే సిబ్బందిని నియమించాలని ఆదేశించినప్పటికీ ఇంతవరకు అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదని అన్నారు. ఆసుపత్రిలో ఎంతో మంచి అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని, తగిన సిబ్బంది లేక రోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల సంఘం ప్రతినిధులు నూతలపాటి అప్పలకొండ, జుత్తుక అప్పారావు, కుంచే నానిబాబు, ఎం.డి వల్లి భాషా, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us