UPDATED 28th JUNE 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు ప్రజలు, వాహనదారులు సహకరించాలని సామర్లకోట ఎస్ఐ మద్దుకూరి వీరవెంకట రవీంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక పోలీసు స్టేషనులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని అన్నారు. అలాగే పోలీసు స్టేషను పరిధిలో రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, పరిశ్రమలు ఉండటంతో భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నందున ప్రజలు, వాహనదారులు, ఆటో, లారీ యూనియన్ నాయకులతో త్వరలో ట్రాఫిక్ పై అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే వాహనదారులు విధిగా నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు.







