TikTok: మూడో అతిపెద్ద సోషల్‌ మీడియాగా టిక్‌టాక్‌..?

రెడ్ బీ న్యూస్, 21 డిసెంబర్ 2021: చైనాకు చెందిన సోషల్‌ మీడియా దిగ్గజం టిక్‌టాక్‌ మరో ఘనతకు చేరువవుతోంది. 2022లో ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే మూడో అతిపెద్ద సోషల్‌ మీడియా సంస్థగా ఎదగనుందని ‘ఇన్‌సైడర్‌ ఇంటెలిజెన్స్‌’( గతంలో ఈమార్కెటర్‌ )అనే సంస్థ పేర్కొంది. 2022 నాటికి ప్రతినెలా దీనిని 75 కోట్ల మంది వినియోగిస్తారని అంచనా వేసింది. 2020లో టిక్‌టాక్‌ వినియోగదారుల సంఖ్య 59.8శాతం వృద్ధి చెందగా.. 2021లో ఈ పెరుగుదల 40.8శాతంగా ఉంది. ‘‘టిక్‌టాక్‌ నుంచి ప్రధాన పోటీ స్నాప్‌ఛాట్‌కు ఉంది. ఈ రెండు యువతను ఆకర్షించడంలో పోటీ పడుతున్నాయి’’ ఇన్‌సైడర్‌ ఇంటెలిజెన్స్‌ విశ్లేషకురాలు డెబ్రా ఓహ్ పేర్కొన్నారు. టిక్‌టాక్‌కు ట్విటర్‌కు ఎటువంటి పోలికలు లేవని తెలిపారు. టిక్‌టాక్‌ కంటెంట్‌ వ్యసనంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌కు ప్రతినెలా 291 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఏటా వీరి సంఖ్య 6శాతం పెరుగుతోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us