UPDATED 28th MARCH 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో రాష్ట్రంలో పదకొండు జిల్లాలలో నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లకు రెండవ బ్యాచ్ లో పది రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసినట్లు కేంద్రం ఫాకల్టీ వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదకొండు జిల్లాల నుంచి శిక్షణకు రావలసి ఉండగా నాలుగు జిల్లాల నుంచే వచ్చారన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలు జె .రాంబాబు, రామమోహనరావు, ఎస్.కె. మొహిద్దిన్, రిసోర్స్ పర్సన్స్ బి. శ్వేత, ఎస్.లివింగ్ స్టన్ పాల్గొన్నారు.







