UIPDATED 8th DECEMBER 2017 FRIDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో ఈ నెల తొమ్మిదవ తేదీన ఉచిత దంతవైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సతీష్ రెడ్డి మాట్లాడుతూ మనిషి ఆరోగ్యానికి దంతాల పరిరక్షణ ఎంతో అవసరమని, ప్రతీ ఒక్కరూ దంతాల పరిరక్షణ పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. తమ సంస్థలో పనిచేస్తున్న అధ్యాపక, అధ్యాపకేత సిబ్బందికి కాకినాడకు చెందిన ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ ఎస్.వి. వెంకటేష్, డాక్టర్ శివ సువర్ణ దంతపరీక్షలు నిర్వహిస్తారని, ఈ శిబిరం ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫార్మసీ కళాశాల భవనంలో జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ కె. రవిశంకర్, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె.దివాకర్ తదితరులు పాల్గొన్నారు.







