పాడేరు (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: శిక్షణ ఐఏఎస్‌ల బృందం సభ్యులు మన్యంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను పీఓ వారికి వివరించారు. ఏజెన్సీలో కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం వంటి వాణిజ్య పంటలు సాగవుతున్నట్లు చెప్పారు. ఏకీకృత పాలనా విధానంలో పీఓ అధికారాలు, విధులపై అవగాహన కల్పించారు. మన్యంలోని సహజ సిద్ధ అందాల గురించి వివరించారు. సబ్ కలెక్టర్ అభిషేక్‌తో పాటు 14 మంది శిక్షణ ఐఏఎస్‌లు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







