విద్యార్థులకు క్రమశిక్షణ బాల్యం నుంచి అలవాటు చేయాలి

* సాయిసుధా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాడ్రేవు రవి
* ఘనంగా ప్రగతి పాఠశాల 14వ వార్షికోత్సవం

UPDATED 18th FEBRUARY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: విద్యార్థులకు మంచి నడవడిక, నేర్పు, పట్టుదల, క్రమశిక్షణలను బాల్యం నుంచే అలవాటు చేయాలని డాక్టర్ వాడ్రేవు రవి అన్నారు. సామర్లకోట పట్టణంలో గల ప్రగతి పాఠశాల 14వ వార్షికోత్సవం ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ ఎన్. పూర్ణచంద్రరావు అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిసుధా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాడ్రేవు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సామాజిక, నైతిక విలువలతో పాటు సామాజిక బాధ్యతలు, మానవతా విలువలను పెంపొందించే భాద్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ప్రగతి విద్యా సంస్థల అధినేత పూర్ణచంద్రరావు మాట్లాడుతూ తమ పాఠశాలలో అనుసరిస్తున్న పటిష్టమైన పాఠ్య ప్రణాళిక, ఒత్తిడిలేని విద్యా విధానాన్ని నిష్ణాతులైన ఉపాధ్యాయుల సహకారంతో అందించడం జరుగుతుందని, అలాగే ప్రధానంగా విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని మంచి విద్యావంతులు కావాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఈ  కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి విద్యా సంస్థల అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డి.వి సర్వేశ్వరరావు, డీన్ కిరణ్, ప్రిన్సిపాల్ సత్యన్నారాయణ, హెచ్ఎం నరసమాంబ, భరత్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,  సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 
  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us