UPDATED 9th MARCH 2020 MONDAY 5:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభలో కళాశాల డీన్ అడ్మిన్ డాక్టర్ జి. నరేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. తమ కళాశాల ఎన్ఎస్ఎస్ సేవా విభాగం ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించిన ఈ క్యాంప్ లో ప్రభుత్వ పధకాలు, స్వచ్ఛభారత్, హెల్త్ క్యాంప్, ఒమెన్ ఎంపవర్‌మెంట్, డ్రగ్ డీ ఎడిక్షన్ వంటి వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్ధులకు డ్రాయింగ్, కబడ్డీ, ఖో-ఖో పోటీలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఈ క్యాంప్ విజయవంతంగా నిర్వహించిన ఎన్ఎస్ఎస్ విభాగం సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం డ్రాయింగ్, కబడ్డీ, ఖో-ఖో పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజశేఖర ఫణీంద్ర, బి. సుధీర్, పి. రామ్ మోహన్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు, వాలంటీర్లు ప్రమోద్, చైతన్య, సూర్యనారాయణ రెడ్డి, ముఖేష్ రెడ్డి, జ్యోతిర్మయి, ప్రవల్లిక, ఎన్ఎస్ఎస్ క్లర్క్ బి. పాపారావు, కె. విష్ణు, గ్రామ పెద్దలు కె. రాజాబాబు, చినబాబు, తమ్మయ్య, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
.







