UPDATED 16th DCCEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ. లక్ష ఆర్ధిక సహాయాన్ని రాజమహేంద్రవరం నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఉద్దండ శివప్రసాద్ పట్నాయక్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కార్యదర్శి మండెల శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్న పట్నాయక్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేసి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించడం జరిగిందని, గతంలో పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో ఇద్దరు జర్నలిస్టుల కుటుంబాలకు ఇదే తరహాలో లక్ష రూపాయలు వంతున ఏపీయుడబ్ల్యూజె తరపున మంజూరు చేయించి అందించామని తెలిపారు. అలాగే ఇంతవరకూ తూర్పుగోదావరి జిల్లాలో 11 మంది జర్నలిస్టుల కుటుంబాలను ఆర్ధికసాయం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, మన్యం చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.







