యువకుని వైద్యానికి ఆర్థిక సాయం

సామర్లకోట:6 జూలై 2020(రెడ్ బీ న్యూస్):బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న యువకుడి వైద్యానికి పలువురు దాతలు ముందుకు వచ్చి వారు సేకరించిన రూ. 3.10 లక్షలను యువకునికి సోమవారం అందజేశారు. సామర్లకోటకు చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధ పడుతూ ఉండడంతో అతని ఆపరేషన్ కోసం కత్తిపూడి హెల్పింగ్ హార్ట్స్ రూ. 40 వేలు, కత్తిపూడి ఫ్రెండ్స్ సర్కిల్ రూ. 63,546,ఆదిత్య కళాశాల ఫ్రెండ్స్ సర్కిల్ రూ. 93,600, పెద్దాపురం - సామర్లకోట సోషల్ మీడియా మిత్రులు రూ. 52,174,యూఎస్ ఫ్రెండ్ సర్కిల్ రూ.60,680లు అందచేశారు. ఈ మొత్తం రూ. 3.10 లక్షలు వివరాలను సేకరించి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సహాయాన్ని అందించిన వారందరికీ రాజ్ కుమార్ అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us