జూలై 17న ఆదిత్యలో క్యాంపస్ ఇంటర్వ్యూలు

UPDATED 14th JULY 2018 SATURDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ నెల 17వ తేదీన ప్రముఖ కంపెనీ దివిస్ లేబొరేటరీస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఫార్మసీ, ఎంఫార్మసీ, బిఎస్సీ(కెమిస్ట్రీ), ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై అభ్యర్థులు అర్హులని, వ్రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని అన్నారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్, విశాఖపట్నంలలో పనిచేయవలసి ఉంటుందని, వీరికి రూ.1.44 నుంచి 1.96 లక్షలు వార్షిక వేతనం, భోజన, వసతి సౌకర్యాలు లభిస్తాయన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయన కోరారు. ఈ సమావేశంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us