భీమేశ్వరస్వామి ఆలయంలో రోజా ప్రత్యేక పూజలు

UPDATED 6th JANUARY 2020 MONDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత కుమారామ భీమేశ్వరస్వామి వారిని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్.కె. రోజా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఆలయానికి విచ్చేసిన ఆమెకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించుకుని అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ నంది మండపంలో వేద పండితులు వేదస్వస్తి పలికి ఆశీర్వచనం చేశారు. అనంతరం స్థానిక విలేఖరులతో రోజా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై ఆమె విమర్శలు చేశారు. చంద్రబాబు అమరావతిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటే ఎలా నమ్మాలని ప్రజలు అడుగుతున్నారని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో తాము కొన్న భూములు, హెరిటేజ్‌కు చెందిన భూముల రేట్లు పడిపోతాయనే తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నా చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, పార్టీ  నాయకులు మట్టపల్లి రమేష్, ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, సేపేని సురేష్, మద్దాల శ్రీనివాస్, శెట్టిబత్తుల దుర్గారావు, గోకేడ రాజా, పాగా సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us