కొత్త తుంగపాడులో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం

UPDATED 15th MARCH 2018 THURSDAY 6:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మండలంలోని కొత్త తుంగపాడు గ్రామంలో వారం రోజులు పాటు నిర్వహించే ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం గురువారం ప్రారంభమైనట్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.వి. సుబ్బారావు  తెలిపారు. ఈ శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామ్మూర్తి ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అభినందనీయం అన్నారు. అనంతరం గ్రామంలో విద్యార్థులు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ పి.వి.జి.కె. జగన్నాధరాజు, ఈవో మూర్తి, కొత్త తుంగపాడు గ్రామ ప్రముఖులు దొడ్డా వీరన్న, ఉప సర్పంచ్ వెలిసి రాజారావు, గండి ఏడుకొండలు, ఎంపిటిసి కమిడి వెంకన్న, విఆర్వో హరిమోహన్, జన్మభూమి కమిటీ సభ్యులు దొడ్డా వెంకటేశ్వర్లు, ఆర్. పూసలరావు, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us