UPDATED 12th JULY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సామర్లకోట మండలం అచ్చంపేట, గొంచాల, పండ్రవాడ, కొప్పవరం, నవర, పవర, వేమవరం, బ్రహ్మానందపురం, చంద్రంపాలెం గ్రామాలలో గురువారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఈ నెల 18న పార్టీ అధినేత జగన్ నియోజకవర్గంలో పర్యటిస్తారని, ఈ యాత్రను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తాటికొండ అచ్చిరాజు, చిన్నబాబు, సలాది రమేష్, వెంకటేశ్వరరావు, చోడిశెట్టి అబ్బాయి, పెద్దబాబు, తదితరులు పాల్గొన్నారు.







