యువతలో స్పూర్తిని నింపేలా రక్తదాన శిబిరాలు

* కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు 
* దివిలి కిట్స్ లో రక్తదాన శిబిరం

UPDATED 6th MARCH 2020 FRIDAY 9:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): యువతలో స్పూర్తిని నింపేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు  దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో, సూర్య శక్తి బ్లడ్ బ్యాంక్ (కాకినాడ) సౌజన్యంతో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కళాశాల చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రమాదం జరిగినపుడు, ప్రసవ సమయంలో, అనారోగ్యం పాలైనపుడు రక్తం అవసరం చాలా ఉంటుందని, రక్తదానం చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ కుమార్, ఏవో కెఆర్ సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసీవో పెదకాపు, బి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ సోమశేఖర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మందపల్లి సత్తిబాబు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.    

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us