వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం

UPDATED 11th MARCH 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం వాడీవేడిగా సాగింది. ఎంపిపి ఆకునూరి సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఉపాధి హామీ అధికారుల తీరుపై పలువురు ప్రజాప్రతిందులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇరిగేషన్ అధికారులు సమావేశానికి సమయానికి హాజరు కాకపోవడంతో కోపోద్రుక్తులయ్యారు. ఉపాధి కూలీలకు జాబ్ కార్డులను సక్రమంగా అందించడం లేదని, దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నట్లు పెదబ్రహ్మదేవం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు తోటకూర శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనుబాబు, ఎంపిడివో నాగేశ్వరరావు, తహసీల్దార్ ఎల్. శివకుమార్, సర్పంచ్ లు కుర్రా నారాయణస్వామి, వల్లూరి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us