వ్యవసాయ శాఖా మంత్రిని కలిసిన పామాయిల్ రైతులు

UPDATED 15th JUNE 2020 MONDAY 7:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా ఆయిల్ పామ్ రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబును కాకినాడలో క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిశారు. పామాయిల్ సంక్షేమ సంఘం సభ్యులు సత్తి రామారెడ్డి, పి.వి.వి. సత్యనారాయణమూర్తి (బుజ్జిబాబు), ఎస్.వి.వి.కె. పురుషోత్తమరెడ్డి, నల్లమిల్లి బాలమురళీ కృష్ణారెడ్డి, తదితరులు కలిసి ఆయిల్ పామ్ రైతుల సమస్యలను వివరించారు. అలాగే జిల్లాలో ఆయిల్ పామ్ గెలల తూకాల్లో జరుగుతున్న మోసాలను వివరించి మంత్రికి వినతి పత్రం అందచేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఈ  విషయంపై చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us