ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

UPDATED 30th AUGUST 2018 THURSDAY 5:30 PM

సామర్లకోట: స్థానిక బ్రౌన్ పేట వద్ద గల వాక్ విత్ క్రిస్ట్ చర్చి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం గురువారం  నిర్వహించారు. పాస్టర్ పి. ఆనంద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ ప్రారంభించారు. పిఠాపురం సిఎంసి ఆసుపత్రికి చెందిన కంటి వైద్యులు రాబర్ట్ ప్రసాద్, సిహెచ్ జయవర్మ, లాజరు సిహెచ్ ఆనంద్ బృందం సుమారు 100 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే ఆపరేషన్ అవసరమైన రోగులకు పిఠాపురం సీఎంసి ఆసుపత్రిలో నిర్వహించేందుకు 30 మందిని ఎంపిక చేసి వీరికి శుక్రవారం ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం సభ్యులు జుత్తుక అప్పారావు, కుంచే నానిబాబు, షేక్ వల్లీభాషా, మున్వర్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us