UPDATED 8th APRIL 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రాభివృద్ధి జరగాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థిని తోట వాణి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం సామర్లకోట మండలంలోని జి. మేడపాడు, జి.కొత్తూరు గ్రామాల్లో ఆమె ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆయా గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా వారు ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తేవాలని, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముందుగా జి. మేడపాడు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె గ్రామంలో వృద్ధుల సమస్యలు తెలుసుకుంటూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. రాజన్న ఆశయాలు నెరవేరాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.







