ఆదిత్యలో మెగా ఉద్యోగమేళా

UPDATED 28th MAY 2018 MONDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ నెల 28, 29 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సమాచార, సాంకేతిక సంస్థ(APITA) ఆధ్వర్యంలో రాష్ట్రంలో గల 13 జిల్లాలలో గల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే సత్ సంకల్పంతో వివిధ జిల్లాలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాలు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆదిత్య క్యాంపస్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ రవీంద్ర తెలిపారు. మొదటిరోజు 27 కంపెనీలకు పైగా పాల్గొని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు రవీంద్ర తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి పిజి వరకు విద్యార్హతలు గల నిరుద్యోగ యువత అంతా పాల్గొనవచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు www.apita.ap.gov.in లో చూడవచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఇదే వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని, సాంకేతిక విద్యార్హతలు గల అభ్యర్థులతో పాటు సాధారణ విద్యార్హతలు గల అభ్యర్థులు సైతం ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని, 29వతేదీ రెండవరోజు కూడా ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగ పరుచుకోవాలని సతీష్ రెడ్డి తెలిపారు. మొదటిరోజు కార్యక్రమంలో 1070 మంది అభ్యర్థులు పాల్గొన్నారని, అందులో 210మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా, 230 మంది ఫైనల్ రౌండ్ కు ఎంపిక అయ్యారని తెలిపారు. వీరికి మరొక రౌండ్ తర్వాత ప్రతిభ కనబరిచిన వారికి నియామక పత్రాలను అందిస్తారని వివరించారు. రెండవరోజు మరిన్ని కంపెనీలు రానున్నాయని జిల్లా అభివృద్ధి సంస్థ మేనేజర్స్ (డి.డి.ఎం) కె. శ్రీధర్, ఎన్. వంశీ తెలిపారు. ఆదిత్య యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాకు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, కళాశాల సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సహాయ సహకారాలు అందించారని శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ,  ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us