పేదవాడి సంక్షేమానికి అహర్నిశలు కృషి

UPDATED 6th DECEMBER 2018 THURSDAY 6:00 PM

సామర్లకోట: పేదవాడి సంక్షేమానికి అహర్నిశలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండల పరిధిలోని హుస్సేన్ పురం గ్రామంలో ఎస్సీ పేటలో రూ.62.50 లక్షల ఎస్సీ సబ్-ప్లాన్ నిధులతో నిర్మించ తలపెట్టిన భూగర్భ డ్రైనేజి, సిసి.రోడ్లుకు మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. అలాగే రూ.15 లక్షల ఎంజిఎన్ఆర్ఇజిఎస్, జిపి నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం, స్త్రీశిశు సంక్షేమశాఖ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి అహర్నిశలు పేదవాడి అవసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. హుస్సేన్ పురం గ్రామంలో గత నాలుగు  సంవత్సరాలలో సుమారు రూ. రెండు కోట్లుతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ఈ గ్రామంలో కొత్తగా 112 మందికి తెల్ల రేషన్ కార్డులు, ఎన్టీఆర్ భరోసా క్రింద 297 మందికి ప్రతీ నెల 3,34,500 పింఛన్లు అందచేస్తున్నామని, అలాగే  ఎన్టీఆర్ హౌసింగ్ పధకం క్రింద 56 మందికి గృహ నిర్మాణం చేపట్టామని అన్నారు. చంద్రన్నభీమా పథకం క్రింద 12 మందికి రూ.16 లక్షలు భీమా సొమ్ము అందచేశామని, డ్వాక్రా రుణమాఫీ క్రింద 880 సంఘాలకు రూ.70 లక్షల 40 వేలు మాఫీ అందచేశామని తెలిపారు. రైతు రుణమాఫీ క్రింద 171 మంది రైతులకు రూ.5 లక్షల 58వేల 218 మాఫీ చేశామని, కొత్తగా డ్వాక్రా రుణాలు రూ.45 లక్షలు మంజూరు చేశామని, సిఎం రిలీఫ్ ఫండ్ క్రింద సుమారు రూ.8 లక్షలు వైద్య ఖర్చులు నిమిత్తం అందచేశామని, గ్రామంలో హెల్త్ సెంటరుకు భవనాన్ని సమకూరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఎస్సీ పేటలో గల డాక్టర్ బి.ఆర్.అంబేథ్కర్ 62వ వర్థంతిని పురస్కరించుకుని  అంబేధ్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ పేటలో గల ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని మేఘనతో డిజిటల్ విద్యాభోదనకు సంబంధించి ట్యాబ్ పై ఉన్న పరిజ్ఞానాన్ని మంత్రి చినరాజప్ప పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి గుమ్మళ్ళ విజయలక్ష్మి, ఎంపిపి ఆకునూరి సత్యనారాయణ, ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు), వైస్ చైర్మన్ చిట్టిబాబు, తోటకూర శ్రీను, గుమ్మళ్ళ రామకృష్ణ, వల్లూరి శ్రీనివాస్, టి. పోతురాజు, ఇన్ ఛార్జ్ ఎంపిడివో సిహెచ్ జగ్గారావు, ఏపివో  సుధారాణి, ఎపిఎం జగదీశ్వరి, మాజీ సర్పంచులు, అంగన్వాడి కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us