రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు

★ పట్టణంలో 3, రూరల్ లో 3 దుకాణాలు సీజ్

★ దుకాణాలపై 6ఏ కేసులు నమోదు

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : పెద్దాపురం పట్టణ, రూరల్ పరిధిలో విజిలెన్స్ అధికారులు రేషన్ దుకాణాలపై మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరు రేషన్ దుకాణాలను సీజ్ చేసినట్లు ఎంఎస్వో ఎం. లక్ష్మీకుమారి తెలిపారు. తూకాల్లో, స్టాకు రిజిస్టర్ లో తేడాలను విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు ఆమె తెలిపారు. దీంతో పట్టణ పరిధిలో 7,12,10 నంబర్ షాపులను, రూరల్ పరిధిలో కట్టమూరులో షాపు నంబర్ 20, 23, ఆర్ బీ పట్నంలో గ్రామంలో 18వ నంబర్ షాపును సీజ్ చేసినట్లు ఆమె చెప్పారు. ఆరు దుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేశామన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us