రెడ్ బీ న్యూస్, 11 జనవరి 2022 : కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. ఇప్పటికే కుదేలు అయిపోయిన సినీ పరిశ్రమను కరోనా వణికిస్తోంది. సినీ ప్రముఖులు అంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు మంచు మనోజ్, లక్ష్మి మంచు, మహేశ్ బాబు, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులకు కరోనా సోకగా హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నా. జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ వైరస్ బారిన పడ్డాను. అంటే పరిస్థితి చాలా సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది. అందరూ కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించండి. ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. ఈ మధ్యకాలంలో నన్ను కలిసిన వాళ్లంతా దయచేసి టెస్ట్ చేయించుకోండి. వ్యాక్సిన్ వేయించుకోకపోతే త్వరగా వేయించుకోండి. త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నా అని కీర్తీ సురేశ్ పోస్ట్ చేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







