వైసిపి విజయోత్సవ సంబరాలు

UPDATED 24th MAY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో  పట్టణంలో శుక్రవారం విజయోత్సవాలు నిర్వహించారు. స్థానిక రధం సెంటర్ వద్ద పార్టీ నాయకులు గోలి వెంకట అప్పారావు చౌదరి, కాటూరి జానకి రామయ్య ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. అనంతరం మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి మంచి పాలన అందిస్తారని, జగన్‌ తాను అనుకున్నది సాధిస్తారని అన్నారు. ప్రజల ఆశీస్సులు జగన్‌కు ఉండటం వల్లే ఆయనకు బ్రహ్మారథం పట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వల్లూరి సచేంద్రకుమార్, యార్లగడ్డ జగదీష్, కొండపల్లి శ్రీను, పి. రాంబాబు, సిహెచ్. ప్రసాద్, పి. సతీష్, గోలి బాల, డేగల రాంబాబు, రెడ్డి, మోటూరి సతీష్,  తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us