UPDATED 10th DECEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంపెంగతోట పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర సోమవారం నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పాత పెద్దాపురం ఒకటవ వార్డుకు చెందిన దళితులైన నిరుపేదలు సుమారు 100 మందికి దుప్పట్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. త్వరలో తమ పార్టీ జిల్లా, పట్టణ, గ్రామ కమిటీలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మిల ఫణీంద్ర, కాటంరెడ్డి దొరబాబు, వడ్డాది శివ, చుక్కా వెంకటరమణ, ఎం. కన్నబాబు, నందమూరి రంగ, తోట ఏసేబు, దివాణం, తదితరులు పాల్గొన్నారు.







