ఆదిత్యలో గురుపూర్ణిమ మహోత్సవాలు

UPDATED 25th JULY 2018 WEDNESDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ ప్రాంగణంలో కొలువైవున్న ఈ నెల 27న గురుపూర్ణిమ మహోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం కాకడ హారతి, హోమాలు, గణపత్యాది పంచాయతన దేవతలకు విశేష పూజలు, పంచామృత అభిషేకములు, పుష్పాభిషేకములు, సహస్రనామార్చన, నీరాజన మంత్రపుష్పం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో యావన్మంది భక్తులు పాల్గొని బాబావారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us