UPDATED 24th MARCH 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: లెవెన్ స్టార్స్, మహిళా సాధికారత చట్టాలు, అలాగే వారి జీవనోపాధి, ఉపాధి హామీల గురించి శిక్షణా కార్యక్రమం శనివారం స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో జరిగింది. జిల్లాలోని మహిళా సంఘాల ప్రతినిధులకు మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం శనివారంతో ముగిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎన్.వి.వి.ఎస్ మూర్తి మాట్లాడుతూ మహిళలు శిక్షణలను సద్వినియోగం చేసుకుని అన్నిరంగాలలో అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మూర్తి, శ్వేత, ఫ్యాకల్టీలు ఎ. గోపాలరావు, అసిస్టెంట్ కోర్సు డైరెక్టర్ మొహిద్దీన్, మహిళా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.







