పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ మెగా మేళా

UPDATED 29th MARCH 2018 THURSDAY 10:00 PM

సామర్లకోట: కాకినాడ పోస్టల్ డివిజన్ పరిధిలో సేవింగ్స్,ఇన్సూరెన్స్ మెగా మేళా కార్యక్రమాన్ని స్థానిక నీలమ్మ చెరువు వద్ద గల కల్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ రీజియన్  డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఇ.వి. రావు హాజరైయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడుతూ తపాలా శాఖ సేవలను ప్రజలందరికీ తెలియచేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలను కలుసుకుని పోస్టల్ సేవలు వివరించడానికి ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఏటిఎం మిషన్లు వచ్చాయని తెలిపారు. రైల్వే టిక్కెట్లను కూడా పోస్టల్ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సేవింగ్స్ పై అవగాహన పెంచి బీమా చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డివిజన్ పోస్టల్ సూపరెంటెండెంట్ ఎ.ఈశ్వరరావు, సామర్లకోట సబ్ డివిజన్ ఎ.ఎస్.పి హరిప్రసాద్, కాకినాడ పోస్టల్ అధికారి సి.హెచ్. అప్పారావు, పెద్దాపురం సబ్ డివిజన్ ఐపిఓ ఎ. వీరభద్రరావు, సామర్లకోట పోస్ట్ మాస్టర్స్ శేషాచార్యులు, డి.కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు. 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us