UPDATED 26th AUGUST 2017 SATURDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో వినాయక చతుర్థి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చతుర్థి వేడుకల్లో సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ భక్తుల అభీష్టాన్ని నెరవేర్చే సిద్ది వినాయకుడు విద్యార్థులందరికీ మంచి బుద్ధిని, జ్ఞ్యానాన్ని ప్రసాదించాలని కోరారు. అలాగే తమ కళాశాలలో సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు దూరంగా ఉన్నామనే తలంపు రాకుండా తమ కళాశాలలో పండుగలను, సంప్రదాయ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ పండుగ వేడుకలు తమతో పాటు పాల్గొని ఇంటిని మరిపించే విధంగా తమ కుటుంబం కన్నా మిన్నగా చూసుకునే యాజమాన్యం లభించడం తమ అదృష్టమని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.







