విద్యార్థులకు క్రీడాపోటీలు

UPDATED 29th OCTOBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక అయోధ్యరామపురంలోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పట్టణ పరిధిలోని నాలుగు మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన క్రీడాపోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, అథ్లెటిక్స్ విభాగాల్లో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించగా, ఈ పోటీలకు చైర్మన్ గా మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరరావు, మెంబర్స్ గా పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, యు. సత్యనారాయణ, ఆర్. శ్రీనివాసరాజు, టి శ్యామ్ సుందర్, కన్వీనరుగా వ్యాయమ ఉపాధ్యాయులు తాళ్లూరి వైకుంఠం వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఎం. వెంకటేశ్వర్లు, రాజేంద్ర భవాని, టి రాంబాబు, ఖోఖో కోచ్ కె. కృపావతి పాల్గొని యు.ఎల్.బి  కోఆర్డినేటర్ కె.ఎస్. శేఖరం పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లాస్థాయిలో నవంబర్ 4,5 తేదీల్లో జరిగే  పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం నవంబర్ 9,10 తేదీలలో కర్నూల్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని కోఆర్డినేటర్ కె.ఎస్. శేఖరం తెలిపారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us