లలితాత్రిపురసుందరిదేవి అవతారంలో విజయదుర్గాదేవి

UPDATED 25th SEPTEMBER 2017 MONDAY 8:00 PM

రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో దసరా శరన్నవరాత్రి  ఉత్సవాల్లో భాగంగా ఐదవరోజు అమ్మవారు లలితాత్రిపురసుందరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు చీమలకొండ శ్రీనివాస్, చక్రవర్తుల మాధవాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పంచద్రవ్యాలతో అభిషేకాలు, లలిత అష్టోత్తర, లలితా సహస్రనామాలు, సామూహిక  కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాడ్  ప్రసంగిస్తూ త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంతో, సకల లోకాతీత కోమలత్వంతో లలితా త్రిపురసుందరి దేవి ప్రకాశిస్తుందని, సకల సృష్టి, స్థితి, సంహారకారిణి, శ్రీవిద్యా స్వరూపిణి ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత  అన్నారు. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి వింజామరలు వీస్తుండగా, చెరకుగడ, విల్లు, పాశాంకుశాలు ధరించిన దివ్య స్వరూపంతో తల్లి భక్తులను అనుగ్రహిస్తుందన్నారు. లలితా త్రిపురసుందరి దేవిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు, శుభాలు, ఐశ్వర్యప్రాప్తి కలుగుతుతాయన్నారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కడిమెళ్ళ వరప్రసాద్, కాశీప్రగడ సత్యనారాయణ ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి. బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబి),తదితరులు పాల్గొన్నారు.       

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us