UPDATED 23rd AUGUST 2017 WEDNESDAY 7:00 PM
పెద్దాపురం: శ్రీ ప్రకాష్ విద్యార్థులచే మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం బుధవారం కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట పట్టణాలలో ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ ప్రకాష్ విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడం ద్వారా నీరు కలుషితం కావడంతో పాటు జీవరాసుల మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున ప్రతీ సంవత్సరం పలువురు ప్రముఖులకు మట్టి వినాయక ప్రతిమలు అందచేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. విజయ్ ప్రకాష్ తెలిపారు. దీనిలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు మట్టి వినాయక ప్రతిమను అందచేశారు. సుమారు 10 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు.







