హోంమంత్రి కృషితో ఆసుపత్రికి రూ. మూడు కోట్లు నిధులు మంజూరు

UPDATED 4th MAY 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కృషితో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ. మూడు కోట్లు నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జీవో వచ్చిందని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందిన హోంమంత్రి చినరాజప్ప సారథ్యంలో నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, సుమారు మూడు దశాబ్దాలుగా సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి జరగలేదని, ఆస్పత్రి అభివృద్ధికి రూ. మూడు కోట్లు విడుదల చేయిస్తామని మంత్రి గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు నిధులు విడుదల అయ్యేలా చేశారన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించిన నిధులతో ప్రహరీగోడ, భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, దాతల సహకాంతో ఆస్పత్రిలో ఎసితో పాటు, ఇన్వెర్టర్ కూడా ఏర్పాటు చేశామన్నారు. రూ. మూడు కోట్లతో 30 పడకల ఆస్పత్రి నిర్మాణం జరిగితే మరింత మంది వైద్యులు నియామకం జరిగి 24 గంటలూ ప్రజలకు వైద్యం అందుబాటిలోకి వస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హోంమంత్రి కృషితో పట్టణం అన్నివిధాలా అభివృద్ధి చెందుతోందని, అలాగే ఆస్పత్రికి అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్, ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ పి. చంద్రరావు, కమిటీ సభ్యులు మలిరెడ్డి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us