మాస్క్ లేకుండా బైటకి వెళితే ఇక అంతే..

UPDATED 22nd JUNE 2020 MONDAY 10:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ బయట ప్రదేశాలలో తిరిగేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నియంత్రణలో మాస్క్ పాత్ర చాలా ప్రాముఖ్యమని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో చాలామంది ప్రజలు మాస్క్ లేకుండా సంచరించుచున్నారని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ చెబుతున్నారని అన్నారు. దానికి అనుగుణంగా ఎవరైనా మాస్కులు లేకుండా సంచరిస్తే పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.100, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 50 పోలీసు శాఖ పెనాల్టీ విధించేందుకు అనుమతులివ్వడం జరిగిందన్నారు. మాస్క్ నిబంధనలను ఉల్లంఘించిన వారి వద్ద నుంచి పోలీస్ శాఖ ఈ- చలానా రూపంలో పెనాల్టీ రుసుము వసూలు చేయుటకు పోలీసు శాఖకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. కనుక ప్రజలందరూ సహరించి కోవిడ్ నియంత్రణలో తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలక్టర్ కోరారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us