ఈ-కర్షక్ రైతులకు ఎంతో మేలు

UPDATED 21st JANUARY 2020 TUESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-కర్షక్ లో రైతులు తమ పంటల వివరాలు నమోదు చేయించుకోవాలని కాకినాడ వ్యవసాయ సహాయ సంచాలకులు జి.వి. పద్మశ్రీ  పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మండల పరిధిలోని పెదబ్రహ్మదేవం, మేడపాడు, వేట్లపాలెం, జి.కొత్తూరు గ్రామాల్లో ఈ-కర్షక్ పథకంపై నాలెజ్డ్ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎడిఎ, ఎంపిడివో కె. స్వప్న స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎడిఎ పద్మశ్రీ  మాట్లాడుతూ ఈ-కర్షక్ పథకంలో నమోదు ద్వారా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం, కనీస మద్దతు ధర, రైతు భరోసా, వ్యవసాయ యాంత్రీకరణ, ఇన్ ఫుట్ సబ్సిడీ, ప్రభుత్వం అందించే వ్యవసాయ పథకాలకు అర్హత పొందుతారని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా రైతులకు వాతావరణ సమాచారం, పాడి పంటలు, వ్యవసాయ, ప్రభుత్వ పథకాల సమాచారం రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తోందని, రైతులు మరింత  సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ టోల్ ఫ్రీ  18004198800 నంబర్లో సంప్రదించాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి ఐ. సత్య, ఏఈవో  ఎం.వి. సతీష్, రిలయన్స్ ఫౌండేషన్ సిబ్బంది వి. రమేష్, పి. వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us