విద్యతోనే మహిళాభివృద్ధి

UPDATED 8th MARCH 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: విద్య ద్వారానే మహిళాభివృద్ధి సాధ్యపడుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి పేర్కొన్నారు. మహిళాదినోత్సవం సందర్భంగా స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్, సూపర్ వైజర్లు నళిని అధ్యక్షత వహించిన సభలో చైర్ పర్సన్ మాట్లాడుతూ కుటుంబం సక్రమంగా ఉండాలంటే మహిళ చదువుకుని ఉండాలన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, పాఠశాల హెచ్.ఎం తోటకూర సాయిరామకృష్ణ, డాక్టర్ శైలజ, కౌన్సిలర్లు కంచర్ల సుష్మామోహిని, రెడ్నం సునీత, నేతల వెంకటలక్ష్మి, పాగా శిరీష, పెండ్యాల వీర వెంకటలక్ష్మి, కో-ఆప్షన్ సభ్యులు మేరీ దేవీజాన్, ఉపాధ్యాయులు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు వెంకటలక్ష్మి, మణి, మంగ బాలాత్రిపుర సుందరి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us