UPDATED 9th NOVEMBER 2020 MONDAY 7:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసివున్నప్రసిద్ధ పుణ్యక్షేత్రం మరిడమ్మ దేవస్థానంలో అమ్మవారి జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సోమవారం అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాల్లో వేద పండితులు చిట్టెం హరిగోపాలశర్మ బృందం, దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







