గైట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

UPDATED 8th MARCH 2018 THURSDAY 9:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హెచ్.బి.ఎస్ విభాగాధిపతి డాక్టర్ వి. కుసుమకుమారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి  పాల్గొని మాట్లాడారు. కుటుంబం కోసం, సమాజం కోసం, త్యాగాలు చేసే మాతృమూర్తులను ఏదో ఒక రోజు గౌరవిస్తే సరిపోదని, ప్రతీక్షణం మహిళలను గౌరవించాల్సిన భాద్యత సమాజంపై ఉందన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపట్ల శ్రద్ద వహించాలని, మహిళలు గౌరవించబడే చోట దేవతలు నివసిస్తారని, సమాజంలో మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తే అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ  పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ పి.వి.జి.కె. జగన్నాధరాజు, డాక్టర్ మూర్తి, విభాగాధిపతులు డాక్టర్ బి.సుజాత, తమిళ్ కోడి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us