UPDATED 13th JULY 2018 FRIDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్) పరీక్షా విధానంపై శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినాకిల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ వ్యవస్థాపకుడు టి. రాఘవేంద్ర శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో గల ప్రముఖ విద్యా సంస్థలలో ఉన్నత విద్య అభ్యసించడానికి క్యాట్ ఎంట్రన్స్ టెస్టులో అత్యుత్తమ ర్యాంక్ సాధించాలని, ఈ పరీక్ష దేశమంతటా జరుగుతుందని అన్నారు. ఈ టెస్టుకు హాజరయ్యే విద్యార్థులు అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ తదితర అంశాలలో ప్రతిభ కనబరిచేందుకు తగిన తర్పీదు పొందాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ క్యాట్ ఎంట్రన్స్ టెస్టులో మంచి ప్రతిభ కనబరిచేలా తమ సంస్థ విద్యార్ధులకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని, నిష్ణాతులైన ప్రముఖులతో సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







