శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు

UPDATED 18th MARCH 2018 SUNDAY 10:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగాయన్నారు. సుప్రభాతసేవ, మంగళహారతి, శ్రీ శారదాంబా సమేత శ్రీ రామకృష్ణ పరమహంస అష్టోత్తర శతనామాలతో పూజలు, అభిషేకాలు, పంచాంగశ్రవణం, తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఉగాది నూతన సంతోషాలను, ఆనందాలను తీసుకురావాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ సంవత్సరం వేసవిలో గ్రామంలోని విద్యావంతులు, ఉపాధ్యాయులు సహకారంతో ప్రత్యేక శిక్షణా శిబిరం ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షుడు వింజమూరి సుబ్రహ్మణ్య శర్మ నేతృత్వంలో జరిగిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో సమితి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి విశ్వనాథం, ఉపాధ్యక్షుడు నువ్వుల వెంకట్రాజు, పెంటపాటి మల్లిఖార్జునరావు, నువ్వుల బాబ్జి, తోటకూర సూర్యప్రభాకర్, ఎన్. సూర్యచంద్రరావు, టి. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.          

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us