కోడ్ కూసినా ముసుగు వేయలేదు

UPDATED 10th MARCH 2020 TUESDAY 11:30 AM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోడ్ అమలులోకి వచ్చింది. ఇప్పటికే పలుచోట్ల రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు తొలగించారు. కానీ కొన్ని చోట్ల ఇంకా అలాగే ఉంచారు. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ముసుగులు కూడా వేయలేదు. దీంతో ఎన్నికల కోడ్ అమలులో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో సర్వత్రా కోడ్ అమలుపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా ఎన్నికల కోడ్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని, అలాగే ఫ్లెక్సీలు, విగ్రహాలకు ముసుగులు వేస్తామని పేర్కొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us