తెలుగు యువరాణి-2018 విజేత అపర్ణ

UPDATED 9th JANUARY 2018 TUESDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థిని తెలుగు యువరాణి-2018 పోటీల్లో విజేతగా నిలిచినట్లు ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాకినాడ జి-కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలుగు యువరాణి-2018 పోటీల్లో ఐదు వందల మంది యువతులు పాల్గొనగా, తమ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం బిబిఎ విద్యార్థిని టి. నాగ సాయి అపర్ణ విశేష ప్రతిభ కనబరిచి యువరాణి-2018 కిరీటాన్ని కైవసం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మిస్ వరల్డ్ 2017 ఎస్మా వెల్డర్ (ఆస్ట్రేలియా) మాట్లాడుతూ యువత నేటి పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో పట్టు సాధించి ప్రతిభ కనబరచాలని, ఇటువంటి అందాల పోటీల్లో గెలుపొందేందుకు అనుసరించవలసిన మెళుకువలు, చిట్కాలను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ ఇటువంటి పోటీల్లో పాల్గోవడం వల్ల యువతుల్లో మానసికస్థైర్యం పెంపొందుతుందన్నారు. కుమారి అపర్ణను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు అభినందించారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us