ప్రగతిలో ఘనంగా ఇంజనీర్స్ డే

UPDATED 15th SEPTEMBER 2017 FRIDAY 9:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే ని ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన  నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనదేశంలో ఇంజినీర్లకు ఎంతో విశేష అనుభవం  తో పాటు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నారని, భారతదెశ ఆర్థికాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ ఇంజనీర్స్ డే  వేడుకలను ప్రతీ సంవత్సరం తమ కళాశాలలో ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు పేపర్, పోస్టర్, ప్రెజంటేషన్లు, పిపిటి, వకృత్వం, క్విజ్, మొదలైన అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కళాశాల డైరెక్టర్ మేనేజ్మెంట్ ఎం.వి.హరనాథ్ బాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్,  వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us