UPDATED 27th JANUARY 2019 SUNDAY 9:00 PM
కాకినాడ: విద్యార్థులు బాల్యం నుంచి సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ కి చెందిన ప్రధమ సంవత్సరం ఎంబీఏ విద్యార్థులు కాకినాడ నగరంలో గల పరివర్తన స్ట్రీట్ చిల్డ్రన్ హాస్టల్ ను ఆదివారం సందర్శించి అక్కడి విద్యార్థులకు అవసరమైన నిత్యావసర వస్తువులు బియ్యం, నూనె, పప్పుదినుసులు, తినుబండారాలు అందచేసినట్లు సుగుణారెడ్డి తెలిపారు. విద్యార్థులు బాల్యం నుంచి సేవా కార్యక్రమాలను అలవరచుకోవాలని, తల్లిదండ్రులను సంరక్షించుకోవడంతో పాటు, కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రధమ సంవత్సరం ఎంబీఏ మెంటార్ ఎం. గోవర్ధనరెడ్డి, కుడిపూడి సత్యవతి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం. శ్రీనివాసాచార్యులు, తదితరులు అభినందించారు.







