Ap News: చర్చల్లా కాకుండా చిట్‌చాట్‌లా భేటీ జరుగుతోంది: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే చర్చలు జరుగుతున్న తీరుపై ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనవంతు సమయం వచ్చాక వస్తానంటూ చర్చలు జరుగుతున్న గది నుంచి బయటకొచ్చారు. చర్చల్లో పనికిరాని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఐకాస నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల్లా కాకుండా చిట్‌చాట్‌లా భేటీ జరుగుతోందని సూర్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పేషీ వద్దే ఉద్యోగుల సంఘం ప్రతినిధులు నిరీక్షిస్తున్నారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us