ఎంసెట్ లో కెఎస్ఎన్ కళాశాల విద్యార్థుల సత్తా

UPDATED 4th JUNE 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎంసెట్‌-2019 ఫలితాల్లో సామర్లకోట కెఎస్ఎన్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. తమ కళాశాల నుంచి హాజరైన విద్యార్థులలో 13 మంది ఉత్తమ ర్యాంకులు సాధించడంతో పాటు మొత్తం 98 మంది అర్హత పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ రాధాకృష్ణ మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన విద్యార్థులు సింగరాజు షణ్ముఖ కౌషిక్ (1574) ర్యాంకు, కురుకూరి భాస్కర్ శ్రీనివాస్ (1784), కె.  శ్రావ్య (6762), రౌతు పూజిత (3714), బాల వీరదొర (3735), గంటా జై సంతోష్ (6762), మాగాపు సాయి సందీప్ (6975), కర్రి వెంకట కావేరి (7037), పేరపురెడ్డి వెంకటేష్ (7254) గుడిమెట్ల నారాయణరావు (7340), వై. రాము (7580), డి చైతన్యశ్రీ (8910), ఎన్.వి.వి. సత్యన్నారాయణ (9305) రాష్ట్రస్థాయిలో  ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారిని తీర్చిదిద్దిన అధ్యాపకులను ప్రిన్సిపాల్ రాధాకృష్ణతో పాటు కళాశాల డైరెక్టర్ కెఎస్ఎన్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి నాయుడు, తదితరులు అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us